
పిఠాపురంలో వర్మను జీరో చేశామంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో వైరల్ అయింది. దీనిపై ఇన్ డైరెక్ట్ గా స్పందించిన వర్మ నారాయణపై సెటైర్లు వేశారు. కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడూ మౌనంగానే ఉంటానని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పనన్నారు. ఎవరో ఏదో అన్నారని నేను లక్ష్మణ రేఖ దాటనని స్పష్టం చేశారు. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి.. వర్మ అంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసన్నారు.