
గులాబీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ రోజు రానే వచ్చింది. గులాబీ జెండాను భుజానకెత్తుకొని కార్యకర్తలు, నాయకులంతా ఎల్కతుర్తి సభకు బయల్దేరి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఇవాళ ఆవిర్భావ సభ జరగనుంది. గత నెల రోజులుగా గులాబీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి ఆ పార్టీ నాయకులు సభకు తరలి రావాలని ఆహ్వానించారు. ఈ సభకు లక్షల్లో ప్రజలు వస్తారని అందుకు తగ్గట్టుగానే విస్తృత ఏర్పాటు చేశారు.