
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రవెళ్లి ఫాంహౌస్ లో సమావేశం అయ్యారు. కేసీఆర్ పిలుపుతో కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫాం హౌస్ కు వెళ్లి భేటీ అయ్యారు.
జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో రోడ్ షో లు, ప్రచార వ్యూహం పై డిస్కషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఎలా ముందుకెళ్లాలని సైతం కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.