ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండిమా విమానాన్ని అత్యవసరంగా మంగోలియా రాజధాని ఉలాన్‌బాతర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానాన్ని తనిఖీ చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లైయిట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. బోయింగ్ 777 విమానాన్ని ప్రస్తుతం తనిఖీ కోసం ఉలాన్బాతర్ విమానాశ్రయంలో ఉంచినట్లు పేర్కొంది. ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. విమాన ప్రయాణంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తలేదని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.
      
