ఎయిర్ ఇండియాలో కొత్త మోసం, దశాబ్దాలుగా సాగుతున్న ఒక అక్రమ దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. విమానయాన సంస్థలు తమ సిబ్బందికి ప్రోత్సాహకంగా ఏడాదికి కొన్ని ఉచిత టిక్కెట్లను ఇస్తాయి. ఎయిర్ ఇండియాలోని సుమారు 4,000 మంది ఉద్యోగులు ఏజెంట్లతో కుమ్మక్కై, ఈ టిక్కెట్లను అపరిచితులకు విక్రయించారు. విదేశీ ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా బాధ్యతలను టాటా గ్రూప్ స్వీకరించిన తర్వాత ఈ భారీ అవకతవకలు బయటపడ్డాయి.

