భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్యులు వెంటనే ఆయనను పరీక్షించి, అవసరమైన చికిత్స అందిస్తున్నారు. జైశంకర్ ప్రస్తుతానికి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని సమాచారం. ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.

