నరసరావుపేట తెదేపా ఎమ్మెల్యే అరవిందబాబుపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో అరవిందబాబు వ్యవహారశైలిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా ఎమ్మెల్యే అరవిందబాబు ఎత్తలేదు. బుధవారం ఫోన్ చేసి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో -వ్యక్తిగతంగా వచ్చి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పల్లా ఆదేశించారు.

