ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుభేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుభేందు ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ఉద్యోగులు, ఎపి జుడీషియల్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.

