ఎపి హైకోర్టు సరికొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. ఎపి హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సిజె) జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆమె పంజాబ్ – హర్యానా హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం నుంచి అధికారిక ముద్ర పడడమే తరువాయి, ఆమె అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.

