
ఎపిలో విశాఖపట్నంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెతో పాటు భర్త, పిల్లలకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేశారు. అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. బాధితుతల చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.