మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కు నిరసన సెగ తగిలింది. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తువస్తామా? అని స్థానిక మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 16వ వార్డులో సోమవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే మురళీ నాయక్ వెళ్లారు. రెండేళ్లుగా తమను పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులంటూ రావడంతో స్థానికులు నిరసన తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మా దగ్గరికి వస్తారా’ అంటూ ఎమ్మెల్యేపై మహిళలు విరుచుకుపడ్డారు

