గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ స్పెషల్ జ్యూరీ అవార్డును బాలకృష్ణ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ అందుకున్నారు బాలకృష్ణ. మెమొంటోతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీ, ప్రత్యేక ప్రశంసా పత్రం బాలయ్యకు అందజేశారు. ఈ ప్రైజ్ మనీ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్కు అందిస్తామని బాలకృష్ణ తెలిపారు.

