
ప్రమాదంలో రెండు చేతులు పోయిన ఓ వ్యక్తికి..అత్యంత క్లిష్టమైన సర్జరీని చెన్నైలో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ (RGGGH) ఆస్పత్రి డీన్ శాంతారామన్ నేతృత్వంలో దాదాపు 10 గంటల శ్రమించి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. ఎడమ చేయిని, కుడి చేతికి అతికించారు. అత్యంత క్లిష్టమైన క్రాస్-హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన సర్జరీ అని డాక్టర్లు చెప్పారు. భారత్‌లో ఇలాంటి శస్త్రచికిత్సల్లో ఇది రెండోదని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొదటిదని వెల్లడించారు.