
గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కులగణనను మొత్తం రెండు దశల్లో నిర్వహించాలని చూస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా తొలి దశ కులగణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.