
తెలంగాణ పోలీసులు సామాజిక మాధ్యమాల వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎలాంటి వీడియోను చూసిన వెంటనే ఫార్వార్డ్ చేయకూడదని సూచించారు. మార్ఫింగ్ వీడియోలు అధికంగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖుల వీడియోలను ఎడిట్ చేసి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. “సోషల్ మీడియాలోని ప్రతి వీడియో నిజం కాదు. ఇలాంటి వీడియోలను ఫార్వార్డ్ చేయవద్దు” అని పోలీసులు ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు.డీప్ ఫేక్ టెక్నాలజీ తో తప్పుడు ప్రచారాలు పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఇవి విద్వేషాలను రేపే అవకాశం ఉందని తెలిపారు.