
సోషల్ మీడియా వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్)పై భారీ సైబర్ దాడి జరిగిందని దాని యజమాని ఎలాన్ మస్క్ ఆరోపించారు. ఈ దాడి చేయడానికి చాలా వనరులు ఉపయోగించారని, దీన్ని ఏదైనా పెద్ద సమూహం లేదా దేశమే చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ సైబర్ దాడి వల్ల ప్లాట్‌ఫామ్ అంతటా అంతరాయం ఏర్పడింది, వేల మంది యూజర్లు తమ ఖాతాల్లోకి లాగిన్ అవ్వలేకపోయారు.