ఊటీలో వాటర్ బాటిల్స్ తీసుకొచ్చిన, పర్యాటక వాహన డ్రైవర్లకు రూ.26,400 జరిమానా విధించారు. నీలగిరి జిల్లాలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా యంత్రాంగం, లీటరు, రెండు లీటర్ల వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ బాటిల్స్ తదితర
ప్లాస్టిక్ వస్తువులను నిషేధం విధించింది. జిల్లాకు వచ్చే పర్యాటకుల వాహనాలను చెక్‌పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్న అధికారులు, ప్రయాణికులు తీసుకొచ్చే వాటర్, కూల్‌డ్రింక్స్ బాటిల్స్ స్వాధీనం చేసుకుంటున్నారు.

