గ్రామీణ పేదలకు జీవనాధారమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలపైనా, పేదలపైనా జరిపిన ‘విధ్వంసకర దాడి’ అని అభివర్ణించారు. నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) సమయంలో ప్రధాని ఎలాగైతే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారో, ఇప్పుడూ అలాగే వ్యవహరించారని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి వ్యతిరేకంగా జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

