
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం మూడో రోజుకు చేరింది. ధర్నా శిబిరంలోకి పోలీసులు ప్రవేశించి నిరసనలకు, సమ్మెకు అనుమతి లేదంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న అధ్యాపకులను విస్మరించి యూజీసీ పే స్కేల్ అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం సరికాదని అన్నారు.