
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనాలోచిత వ్యాఖ్యలతో ఉద్యోగులు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందే ఉద్యోగులు అడుగుతున్నారని, కానీ సిఎం ఉద్యోగులను ప్రజల ముందు ఉద్యోగులను విలన్‌లుగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఎన్‌జిఒల త్యాగాల స్పూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలిపారు. ఉద్యోగాలు పోయినా.. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులపై సిఎం రేవంత్ రెడ్డి మాటలు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.