కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021లో కీలక సవరణలు చేసింది. పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులను ఈ కొత్త రూల్స్ ప్రభావితం చేయనున్నాయి. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) సవరణ నిబంధనలు 2025 ప్రకారం.. క్రమశిక్షణా చర్యలతో ఉద్యోగిని విధుల నుంచి తొలగించినప్పుడు సదరు ఉద్యోగి కేవలం పీఎస్యూ బెనిఫిట్స్ మాత్రమే కోల్పోడు, ప్రభుత్వ సర్వీసుల్లో పొందిన పెన్షన్ బెనిఫిట్స్ సైతం కోల్పోవాల్సి వస్తుంది.

