పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. రాజేశ్ మరణించిన వారం రోజులు లోపే రీపోస్టు మార్టం చేసినట్లయితే మృతికి గల కారణాలు స్పష్టంగా తెలిసేవన్నారు. కాలం గడిచే కొద్దీ మృతదేహం కుళ్లిపోయి ఒంటిపై ఉన్న గాయాలు కనపడకుండా పోతాయనే దురుద్దేశంతోనే వంద రోజులపాటు కాలయాపన చేశారని విమర్శించారు. రాజేశ్ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.

