భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ భారత్ మరియు పాకిస్తాన్ మ్యాచ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం పూర్తిగా అంతం కావాలని ఆయన నొక్కి చెప్పారు, కానీ దాని కారణంగా క్రీడలు ఆగిపోకూడదని అన్నారు. “ఉగ్రవాదం కచ్చితంగా ఆగాలి. అది చాలా ముఖ్యం. కానీ క్రీడలు అస్సలు ఆగకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. కేవలం భారత్, పాకిస్తాన్‌లోనే కాకుండా ప్రపంచమంతటా ఉగ్రవాదం అంతరించిపోవాలని ఆయన అన్నారు.

