
పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి కేవలం 22 నిమిషాల్లోనే సమాధానం చెప్పామని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. గతంలో దాడులు చేసి ఉగ్రవాదులు హాయిగా నిద్రపోయేవారని.. కానీ ఇప్పుడు దాడులు చేయాలంటేనే వణుకుతున్నారని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన దేశానికి చుక్కలు చూపించామన్న మోదీ.. మరోసారి పాక్ దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.