రాష్ట్రంలో పెద్దఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్న తరుణంలో ఉపాధి కల్పనపైనే యంత్రాంగం దృష్టిపెట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేశ్ అధికారులతో సమీక్షించారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ తరహాలో ఉగాదికి విడుదల చేయబోయే జాబ్ క్యాలండర్ లో అధ్యాపక పోస్టుల నోటిఫికేషన్ కూడా ఇచ్చి, భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు.

