
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అయితే బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌పై కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సంచలన కామెంట్స్ చేశారు. తాను భాగస్వామిగా ఉన్న ఎన్డీయే సర్కార్‌పైనే ఆయన విమర్శలు గుప్పించారు. పాట్నాలో మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో నితీష్ సర్కార్ విఫలమైందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో అలాంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు క్షమించండి అని అన్నారు.