శనివారం కోల్‌కతాలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలతో కూడిన ‘ఛార్జిషీట్’ను విడుదల చేశారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కేవలం బెంగాల్‌కు మాత్రమే కాకుండా మొత్తం దేశ భద్రతకు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్లో టీఎంసీ గత పదిహేనేళ్లుగా అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. భద్రతను కాపాడటానికి, అక్రమ చొరబాటుదారులను తరిమికొట్టడానికి ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఎంతో అవసరమని నొక్కిచెప్పారు.

