ఈస్టర్ పండుగను పురస్కరించుకుని సి యం చంద్రబాబు నాయుడు పాపుల కోసం శిలువనెక్కిన ఏసు ప్రభువు పునరుత్థానం చెందిన పవిత్రమైన ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు. ఈస్టర్ పండుగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినం. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం మనకు ఆదర్శం కావాలి. ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

