
ఈసారి కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. ‘కార్యకర్తలకు మంచి ఇన్సూరెన్స్ కల్పిస్తాం. మన పార్టీకి 15 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రజల్లో మనం బలంగా ఉన్నాం. ఇంకా బలోపేతం కావాలి. కాబట్టి గ్రామ కమిటీలే ఏర్పాటు కాగానే బూత్ లెవెల్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. మన పార్టీ మరో 30, 40 ఏళ్లపాటు కొనసాగాలంటే కార్యకర్తలు చాలా ముఖ్యం.’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు.