అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ తపిర్ గావో సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలపై జాతి వివక్షత చూపడంతోపాటు దాడుల సంఘటనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ‘ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో కూడా ఈశాన్య ప్రాంతాల ప్రజలు జాతి వివక్ష, దాడులు, హత్యలను ఎదుర్కొంటున్నారు’ అని అన్నారు.

