
ఎన్‌సిఆర్‌బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలు గులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం. ఈ ప్రాంత భద్రతా వాతావరణం అస్థిరంగా ఉంది. తిరుగుబాటు జ్ఞాపకాలు, జాతిపరమైన లోపాలు, మాదకద్రవ్యాల వ్యాపారం, రవాణా వివరాలు నిరంతరం మారుతూ ఉంటాయి, ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బంది కొరత, శిక్షణ లేకపోవడం పెద్దలోపం. 2023లో మణిపూర్‌లో వైఫల్యాలు రాజకీయ, మతపరమైన ఒత్తిడిలో చట్టం అమలు ఎంత దారుణంగా విఫలమవుతుందో తేటతెల్లం చేస్తుంది.