మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. ఈవీఎంల విషయంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయని.. వాటిని రద్దు చేసి.. తిరిగి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని.. కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. అయితే తమ పార్టీ గుర్తు అయిన కారుతో పోలి ఉన్న గుర్తులను.. ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని గత కొన్నేళ్లుగా తాము తీవ్ర పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలను పారదర్శక పద్ధతిలో నిర్వహించాలని సూచించారు.

