
ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయ భవన సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారు జామున రెండుసార్లు ఈ భవనంలో మంటలు చెలరేగాయి. పలు కీలక ఫైళ్లు మంటలకు అహూతి అయ్యాయి. ముంబై బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని కరీం భాయ్ రోడ్లో గల ఖైసర్-ఐ-హింద్ బిల్డింగ్లో ఉందీ ఈడీ కార్యాలయం. అగ్నిప్రమాద తీవ్రతను దృష్టిలో పెట్టుకుని లెవెల్ 2గా ప్రకటించారు. అదనపు సిబ్బందిని పిలిపించి, మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు.