మరో పది రోజుల్లో ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానున్న వేళ.. సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇషాన్ కిషన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. డిప్యూటీగా అభిషేక్ శర్మను నియమించింది. రెగ్యులర్ సారథి పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నట్లు ఎస్ఆర్ హెచ్ తెలిపింది. అతడి గైర్హాజరీలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇషాన్ నడిపిస్తాడని వెల్లడించింది.

