ఇళయరాజా సినిమాల్లో 134 సినిమాల నిర్మాతలు తమ సినిమాల్లో పాటల హక్కులను ‘సరిగమ’ సంస్థకు విక్రయించారు. అది కూడా శాశ్వత ప్రాతిపదికన. అయితే ఆ సినిమాల్లో పాటలు ఉపయోగించుకోవచ్చని కొన్ని మ్యూజికల్ ప్లాట్ఫారమ్లకు ఇళయరాజా అనుమతి ఇచ్చారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ‘సరిగమ’ సంస్థ ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించింది. నిర్మాతల నుంచి రైట్స్ తీసుకున్న ‘సరిగమ’ సంస్థకు పూర్తి హక్కులు ఉంటాయని, ఆ పాటలు తుది తీర్పు వచ్చే వరకు వాడుకోవడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.

