భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్ కు ఆందోళనకరమేనని ఆయన తేల్చేశారు. కోవిడ్ ఎదుర్కొన్న తరహాలో పశ్చిమాసియా సంక్షోభాన్ని కూడా భారత్ అధిగమిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.ఇలాంటి సంక్షోభాల కోసం భారతదేశం తన ముడి చమురు,పెట్రోల్ , డీజిల్ నిల్వలను విస్తరించుకుందని ప్రధాని మోదీ తెలిపారు. నిరంతరాయ సరఫరాను సులభతరం చేయడానికి భారత్ వద్ద పుష్కలమైన ముడి చమురు నిల్వలు ఉన్నాయని ప్రధాని వెల్లడించారు.

