టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా పౌరులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎంబసీ సూచించిన సురక్షిత మార్గాల ద్వారానే దేశం విడిచి వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు అనుమతి లేకుండా అంతర్జాతీయ భూ సరిహద్దుల వైపు వెళ్లే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది. పౌరుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం అత్యవసర ఏవైనా సమస్యలు ఉంటే.. +989128109115; +989128109109; +989128109102; +989932179359 ఈ నంబర్లకు ఫోన్ చేయాలని చెప్పింది. అలాగే cons.tehran@mea.gov.in కు మెయిల్ చేయాలని సూచించింది.

