ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేల మంది అరెస్టయ్యారు. ఇలా నిరసనలను అణచి వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్ ప్రభుత్వం.. దీని కోసం విదేశీ మిలీషియా సాయం తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆందోళనలను అణచి వేసేందుకు వందలాది సాయుధులను నియమించుకొని, టెహ్రాన్‌కు తీసుకువస్తున్నట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇప్పటికే దాదాపు 800 మంది సరిహద్దు దాటి ఇరాన్‌లోకి వచ్చినట్లు తెలిపింది.

