ఇరాన్ ప్రభుత్వం బహిరంగంగా ఉరితీసింది. మృతుల్లో 19 ఏళ్ల రెజ్లర్ కూడా ఉన్నాడు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలపై ఈ ముగ్గురికి ఉరిశిక్ష వేసింది. ఈ ఘటనపై ఇరాన్ మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 19 ఏళ్ల రెజ్లర్ అయిన సలేహ్ మొహమ్మది, సయీద్ దావోది, మెహ్ది ఘసెమి అనే ముగ్గురు వ్యక్తులు ఘర్షణల సందర్భంగా ఇద్దరు పోలీసుల్ని చంపినట్లు ప్రభుత్వం ఆరోపించింది.ప్రభుత్వానికి ఎదురుతిరగడం అంటే దేవుడిని ఎదిరించినట్లే అని అక్కడి ప్రభుత్వం వారిపై కఠిన శిక్షలకు సిద్ధమైంది.

