రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయిన తరుణంలో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కావడమే ఈ ఎన్నిక వాయిదా కు కారణంగా తెలుస్తోంది. తన తండ్రిని ఎవరో కిడ్నాప్ చేశారని యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటి షన్ దాఖలు చేశారు. యాదగిరిని గురువారం తమ ముందు హాజరుపరచాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

