బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలక కూటమిలో తనను ఇబ్బంది పెడుతున్నారని.. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ పరంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజీనామాపై మూడు రోజులుగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వ్యవస్థ సరిగ్గా పని చేయకపోతే, పనులు జరగకపోయినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనకాడబోనని స్పష్టం చేశారు. గండికోట నిర్వాసితులను న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆది ఆరోపించారు.

