
మే నెల నుంచి.. జూలై నెల 31వ తేదీ వరకు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి విచారణ కోసం..3 నెలల్లో తాము 11 సార్లు హైకోర్టుకు వచ్చామని.. సుగాలి ప్రీతి తల్లి వెల్లడించారు. అయితే వచ్చిన ప్రతీ సారి పవన్ కళ్యాణ్‌ను కలవాలని అపాయింట్మెంట్ అడిగినట్లు చెప్పారు. కానీ తమను కలిసేందుకు.. అపాయింట్మెంట్ ఇవ్వలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. అసలు సుగాలి ప్రీతి కేసు అంటేనే తలనొప్పి వస్తుందని అంటున్నారని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించారు.