సామాజిక కార్యకర్త, అనాధాశ్రమాన్ని నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్యను ఎన్‌ఐఎ అధికారులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని సిపిఎం తెలంగాణ కమిటీ ఆరోపించింది. ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. ఆపరేషన్ కగార్, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులను వ్యతిరేకిస్తున్నవారిని, సామాజిక సమస్యలపై స్పందించే వ్యక్తులను అరెస్టులు చేయడం ప్రజాస్వామిక గొంతుకలను అణచివేయడమేనని ఆయనన్నారు.

