గ్లోబ్‌పై ఒకే రేఖవెంబడి మూడు తీవ్ర తుఫాన్‌లు పుట్టాయి. ప్రస్తుతం మొంథా తీరాన్ని తాకినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 3-4గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడింది మొంథా. దీని ప్రభావం ఇప్పటికే ఏపీ తీర ప్రాంతంపై పడింది. ఇక జమైకా తీరప్రాంతం అట్లాంటిక్ మహాసముద్రంలో మెలీషా ఏర్పడింది. ఇక చివరిది పపిఫిక్ మహాసముద్రంలో ఏర్పడింది సోనియా. ఇది మన మొంథా తుఫాన్‌లాగే తీవ్రమైంది కానీ తీరం తాకదు. సముద్రంలో బలహీనపడుతుందని వాతావరణశాఖ చెబుతోంది. .

