హీరోయిన్ శ్రీలీల.. అంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు.. అదే డాక్టర్ శ్రీలీల అంటే మాత్రం అగ్గిమీద గుగ్గిలమవుతోంది సోషల్ మీడియా.నాలుగున్నరేళ్లు కిందా మీద పడి, రేయింబవళ్లు కష్టపడితే పూర్తికానీ డాక్టర్ చదువు.. రోజుకు 3 కాల్‌షీట్సు, నాలుగు పాటలు, ఆరు స్టెప్పులు.. అంటూ సాగే శ్రీలీలకు ఎలా సాధ్యమైంది అన్నదే ఇప్పుడు నెటిజన్ల ప్రశ్న. ఇప్పుడీ టాపిక్ పై సోషల్ మీడియా తెగ చర్చిస్తోంది. హీరోయిన్ శ్రీలీల ఓకే… కానీ డాక్టర్ శ్రీలీల నాట్ ఓకే అంటూ పెద్ద ఎత్తున విమర్శలు, మీమ్సూ వస్తున్నాయి .

