
శ్రీమతి సందిరెడ్డి గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఓ ట్విట్టర్ స్పేస్ చర్చలో ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన అంశం ఇది. ఇతిహాస గ్రంథాలైన రామాయణం, మహాభారతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియా మహిళా స్టేట్ కోఆర్డినేటర్ గాయత్రిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పలువురు నెటిజన్లు ఆమె వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టులు చేశారు.