టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న ఆసక్తికర చిత్రం ‘ఇడుపు కాయితం’ నుంచి మేకర్స్ తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన ‘రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది’ అనే మాటలతో టీజర్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

