ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇజ్రాయెల్ అధికారులు, హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.

