
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జూలై 2025 సెషన్‌లో కొత్తగా ప్రవేశం తీసుకోవాలనుకునే విద్యార్థులకు మరోసారి శుభవార్తను అందించింది. ఇగ్నో ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం, ఆన్‌లైన్ దూరవిద్య (ODL)
మరియు ఆన్‌లైన్ మోడ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం గడువును మళ్లీ పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఇప్పుడు అక్టోబర్ 15, 2025 వరకు తమ అప్లికేషన్లను సమర్పించే అవకాశం పొందనున్నారు.