ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్దం మూడు వారాలకు చేరుతోంది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి ఛీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన ఇరాన్ తాజాగా ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం యొక్క పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ తాకబోతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. ఇరాన్‌పై యుద్ధం అన్యాయమైనదని యూరోపియన్, అమెరికా అధికారులతో సహా పెద్ద సంఖ్యలో గళాలు వినిపిస్తున్నాయని, అంతర్జాతీయ సమాజంలోని ఇతర సభ్యులు కూడా ఇదే బాటలో నడవాలని ఆయన కోరారు.

